లెజెండ్ శరవణన్ 'లీడర్' టీజర్ రిలీజ్
వ్యాపారవేత్త నుంచి నటుడిగా మారిన లెజెండ్ శరవణన్ తన రెండో సినిమాతో సిద్ధమయ్యాడు. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'లీడర్'. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఒక చిన్న పాప కోసం దేన్నైనా ఎదిరించే పవర్‌ఫుల్ పాత్రలో శరవణన్ కనిపిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.