రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
MDCL: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి మిల్క్ పాల కంపెనీ దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. టిప్పర్ లారీ పల్సర్ టూవీలర్‌ను, ఢీకొడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వెంకట్ రాంనగర్‌కు చెందిన మహిళ, రాపిడో బుక్ చేసుకొని, గండి మైసమ్మ వైపు వెళ్తుంది. రాపిడో డ్రైవర్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు.