'స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం'

'స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం'

NZB: రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని జిల్లా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అర్బన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే మార్గనిర్దేశం చేశారు.