ప్రైవేటు బస్సుల్లో ఎస్సై తనిఖీలు
KKD: గొల్లపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎస్సై మోహన్ కుమార్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సుల ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులతో పాటు అత్యవసర భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.