చేపల వేటకు వెళ్లి వాగులో పడి వ్యక్తులు మృతి

చేపల వేటకు వెళ్లి వాగులో పడి వ్యక్తులు మృతి

అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం గుంజనేరు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన శ్రీను (47) మరియు మల్లికార్జున (37) ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు ప్రారంభించారు.