పేకాట స్థావరంపై దాడి..11 మంది అరెస్ట్

NLR: ఆత్మకూరు మండలం నారంపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆత్మకూరు పోలీసులు గురువారం దాడులు నిర్వహించి 11 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుండి ఐదు లక్షల 20 వేల రూపాయలు నగదు, 3 సెల్ ఫోన్లు, రెండు స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఆత్మకూరు సీఐ గంగాధర్, ముగ్గురు ఎస్సైలు, పదిమంది కానిస్టేబుళ్లు ఉన్నారు.