'హరీష్ రావుపై కవిత వ్యాఖ్యలు దురదృష్టకరం'
SRD: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కవిత వ్యాఖ్యలు ఏ పార్టీకి ఉపయోగపడతాయని ప్రశ్నించారు. మరోసారి ఆయనపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.