ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

PDPL: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చికురాయి సర్పంచ్ ఓదెల శ్రీనివాస్ తెలిపారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో స్వచ్ఛత పనులు నిర్వహించారు. వార్డుల్లో మురుగు కాల్వల శుభ్రం, రోడ్లకు ఇరువైపులా చెత్త తొలగింపు పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.