తిరువూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
NTR: తిరువూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. TDP కౌన్సిలర్ శేఖర్ బాబు కుమారుడికి టెండర్లు ఎలా ఇస్తారని YCP కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చట్ట విరుద్ధమని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఛైర్‌పర్సన్ నిర్మలకు నోటీసులు అందజేశారు. నిధులను 20 వార్డులకు సమానంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.