అధ్వాన స్థితిలో రోడ్డు.. స్థానికుల ఆవేదన

అధ్వాన స్థితిలో రోడ్డు.. స్థానికుల ఆవేదన

ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. రోడ్డంతా గుంతలు ఏర్పడడంతో రాత్రి సమయాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణించాలంటేనే భయం వేస్తోందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.