రూ. 2 లక్షల LOC అందించిన ఎమ్మెల్యే జ్యోతుల
KKD: తాళ్లూరుకు చెందిన సూర్య కుమారి క్రోమాగ్రంధి రాళ్ల సమస్యతో రాజమండ్రిలో శుక్రవారం శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు. ఆమె ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అత్యవసరంగా రూ. 2 లక్షల LOC తెచ్చి ఆమె కుటుంబానికి స్వయంగా అందించారు. అత్యవసర సమయంలో అందిన ఈ సహాయం పట్ల కుటుంబసభ్యులు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.