బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గజవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గజవాహన సేవ

SRD: ఖేడ్ సంజీవనరావుపేటలోని అనంతశయన స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి గ్రామస్తుల ఆధ్వర్యంలో ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు శ్రీవారికి గజవాహన సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ లక్ష్మీ అనంతశయన స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.