ఆర్.బీ పట్నం సొసైటీ ఛైర్మన్‌గా దొరబాబు

కాకినాడ: పెద్దాపురం మండలం ఆర్.బీ. పట్నం సొసైటీకి త్రిసభ్య కమిటీని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ ఛైర్మన్‌గా పెనుమత్తి దొరబాబు, సభ్యులుగా బట్టిరెడ్డి శ్రీనివాస్, నల్లల శ్రీనును నియమించారు. నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామితో పాటు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.