ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకుంటారా?

ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకుంటారా?

ఈనెల 14 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఎవరిని ఆడించాలనేది జట్టుకు సవాల్‌గా మారింది. వైస్ కెప్టెన్ కాబట్టి పంత్ ఆడటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జురెల్‌ను బ్యాటర్‌గా ఆడిస్తారా లేదా పక్కన పెడతారో చూడాలి.