చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలి: SI

చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలి: SI

SDPT: వేసవి నేపథ్యంలో చెరువులు, కుంటలు, బావుల వద్ద అప్రమత్తంగా ఉండాలని బెజ్జంకి ఎస్సై సౌజన్య సూచించారు. ఈత రాని వారు లోతైన నీటిలోకి వెళ్లకూడదని, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో ఉండాలన్నారు. మద్యం సేవించి నీటిలోకి దిగడం ప్రాణాపాయమని హెచ్చరించారు. ప్రమాద సూచనలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండి అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.