ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సింగిల్ విండో అధ్యక్షుడు
ATP: పుట్లూరు సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణికి గోవర్ధన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే శ్రావణిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పదవికి న్యాయం చేస్తానని గోవర్ధన్ స్పష్టం చేశారు.