కావలిని జిల్లా చేయాలని ఆర్డీవోకి వినతి

NLR: అన్ని వసతులు ఉన్న కావలిని జిల్లా చేయాలని సోమవారం మాజీ కౌన్సిలర్ పులి రజిని, మాజీ ఏఎంసీ డైరెక్టర్ చక్రపాణి, PDS నేత భాస్కర్ కొంతమందితో కలిసి ఆర్డివో కార్యాలయంలో ఆర్డీవో వంశీకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, రైలు మార్గం, నేషనల్ హైవే, అన్ని వసతులు ఉన్న కావలిని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు.