ప్రజల సమస్యల పరిష్కారానికి "మీట్ యువర్ DSP"

ప్రజల సమస్యల పరిష్కారానికి "మీట్ యువర్ DSP"

కృష్ణా: బందరు డీఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు "మీట్ యువర్ DSP" కార్యక్రమం నిర్వహించనున్నట్లు బందరు డీఎస్పీ సీహెచ్. రాజా తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా డీఎస్పీకి వివరించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభిస్తుందని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర న్యాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.