యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

WGL: కలెక్టరేట్‌లో 2024-25 ఎండాకాలం ధాన్యం కొనుగోళ్లపై శనివారం కలెక్టర్ డా. సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగికి సంబంధించి 2,14,513 మెట్రిక్ టన్నుల సన్నరకం, 44,912 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 206 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు.