'విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి'
ASR: కొయ్యూరు మండలం వైఎన్ పాకలు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి, కిచెన్, భోజనశాలను పరిశీలించారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు.