సికింద్రాబాద్ JBSలో ఎంపీ ఈటల ధర్నా
HYD: సికింద్రాబాద్‌లో బీసీ నేతల బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామున జేబీఎస్ బస్టాండ్ ముందు బీసీ నేతలు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జేబీఎస్ బస్టాండ్ ముందు ధర్నా చేస్తున్న బీసీ నేతలకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. బీసీ నేతలతో కలిసి డిపో ముందు ఈటల బైఠాయించారు.