ట్రాక్టర్ డ్రైవర్‌కు జైలు శిక్ష

ట్రాక్టర్ డ్రైవర్‌కు జైలు శిక్ష

CTR: ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడిపి బాలుని మృతికి కారణమైన డ్రైవర్ గోవింద స్వామికి కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. 2024 నవంబర్‌లో నిరూప్‌ను(7) అతని తల్లి పాఠశాలలో వదిలేందుకు స్కూటీపై బయలుదేరింది. ఫారెస్ట్ రోడ్డులో ట్రాక్టర్ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించారు.