'భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

NDL: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐసీసీటియు ఆధ్వర్యంలో నంది కోట్కూరు లేబర్ ఆపీసర్ శ్రీలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్ చేయడం దారుణమన్నారు.