శాకంబరీగా నూకాలమ్మ దర్శనం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణమాస శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరిగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పంచహారతులు, పంచామృతాభిషేకాలు నివేదించారు. అలాగే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.