'యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు'

'యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు'

NZB: మానవాళికి హాని కలిగించే మాదకద్రవ్యాలను నిషేధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ధర్‌పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కళ్యాణి తెలిపారు. సమాజంలోని ప్రజలందరూ వాటిపై పోరాడినప్పుడే విజయం సాధించగలమని పేర్కొన్నారు. గురువారం ధర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.