ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే
NZB: జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.