మురుగు కాలువలతో దోమల బెడద
NRPT: ధన్వాడ(మం) కేంద్రంలోని బీసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పాత హరిజనవాడ ప్రాంతాల్లో మురుగు కాలువల్లో మురుగునీరు నిలిచి దోమల బాధ ఎక్కువైందని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు వచ్చేవరకు మురుగు కాలువలను శుభ్రం చేయరా అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగు కాలువను శుభ్రం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.