విజయవాడలో ఆందోళన కలిగిస్తున్న బైక్ చోరీలు

విజయవాడలో ఆందోళన కలిగిస్తున్న బైక్ చోరీలు

కృష్ణా: విజయవాడలో ద్విచక్ర వాహనాల చోరీలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగలు తెలివిగా తమ పని కానిస్తున్నారు. రాజమండ్రికి చెందిన భవనారాయణ విజయవాడకు పని నిమిత్తం రాగా బైక్ చోరీ అయ్యింది. గఫూర్ అనే వ్యక్తి బైక్ కూడా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.