సర్వేయర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన రైతు

సర్వేయర్‌పై  కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన రైతు

VKB: ధారూర్ మండల సర్వేయర్‌పై ఆవుసుపల్లి గ్రామానికి చెందిన అంజయ్య కలెక్టర్ దీపక్ తివారీకి ఫిర్యాదు చేశారు. తన భూమిని సర్వే చేయించడానికి సర్వేయర్‌కు డబ్బులు ఇచ్చేందుకు తన దగ్గర డబ్బులు లేవని కలెక్టర్ చొరవ తీసుకుని సర్వే చేయించాలని కోరారు. తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం దక్కలేదని అన్నారు. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.