BRSలో చేరిన సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి సౌమ్య
MNCL: కన్నెపల్లి మండలం జజ్జర్ వెళ్లి గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెరుగు సౌమ్య ఆమెతో పాటు మరో 20 మంది మాజీ MLA దుర్గం చిన్నయ్య సమక్షంలో BRSలో చేరారు. చిన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. కాగా సౌమ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.