డీఈవో ఆధ్వర్యంలో రిటైర్ టీచర్లకు సన్మానం
జనగామ జిల్లాలో ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్న పలువురు ఉపాధ్యాయులకు అదనపు కలెక్టర్ (ఇన్‌ఛార్జి డీఈవో) పింకేశ్ కుమార్ డీఎస్ఈ నుంచి వచ్చిన ప్రశంసాపత్రాలను నేడు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. చంద్రశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.