'భూ రికార్డులను సరిచేసి రైతులకు న్యాయం చేయండి'

అన్నమయ్య: భూ రికార్డులను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోతబోలు గ్రామపంచాయతీలో ఆమె పర్యటించారు. ఇందులో భాగంగా భూ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులను సమస్యలు పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.