'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'

'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'

NZB: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇంఛార్జ్‌తో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు.