కాలేజీలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి
రాజస్థాన్ జైపూర్‌లోని ఓ పాఠశాలలోకి కొంతమంది దుండుగులు వచ్చి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అయితే స్టూడెంట్స్ రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నట్లు సమాచారం.