జూరాల నుంచి శ్రీశైలానికి భారీ వరద

జూరాల నుంచి శ్రీశైలానికి భారీ వరద

NDL: ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. సోమవారం ఉ.6 గంటల సమయానికి శ్రీశైలం డ్యాంకు జూరాల నుంచి 1,56,554 క్యూసెక్కులు చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గానూ 872.50 అడుగులు నీటి సామర్థ్యం 215.7080 టీఎంసీలకు గానూ 152.4941 టీఎంసీల నిల్వలు నమోదయ్యాని పేర్కొన్నారు.