SLBC పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

HYD: జూబ్లీహిల్స్ నివాసంలో SLBC పనుల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రణాళిక, పూర్తిచేసే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అధికారులు హాజరయ్యారు.