వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం

SKLM: బూర్జమండలం ఉప్పిన వలస గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయశాఖ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించారు. పంట కాలంలో రైతులు పాటించాల్సిన అంశాలైన విత్తన రకాల ఎంపిక వాటి లభ్యత, ఉద్యాన పంటలలో సమస్యలు, సందేహాలు, అనుబంధ రంగాలలో రైతులు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.