సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
VZM: సిరిమాను ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలించి, ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. తోపులాటలు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో కీర్తి ఉన్నారు.