'ఉచిత ఇసుక పథకం అమలు చేయాలని నిరసన'

ప్రకాశం: 'ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ప్రజలను నయవంచనకు గురి చేస్తోందని' సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని, ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేసి.. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.