వల్లూరులో 144 సెక్షన్ అమలు: SI
కడప: టెన్త్ పరీక్షల నేపథ్యంలో వల్లూరు కేంద్రం వద్ద ఎస్ఐ శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్ ప్రాక్టీస్ నివారణకు ఇన్విజిలేటర్లకు కూడా మొబైల్స్ నిషేధించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరుతూ 'ఆల్ ద బెస్ట్' చెప్పారు.