'ఇరాన్ పిరికిపంద చర్య'.. ఖతార్ ఆగ్రహం
ఒమన్‌లోని దుక్మ్ వాణిజ్య నౌకాశ్రయం, ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ చేసిన దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది ఒమన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఇరాన్ పిరికిపంద చర్య అని పేర్కొంది. ఇరాన్, అంతర్జాతీయ దేశాల మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశంపై ఈ దాడులు ఆమోదయోగ్యం కాదని ఖతార్ స్పష్టం చేసింది. ఒమన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది.