ఎంపీడీవో ఎదుట కాలనీ వాసులు ఆవేదన

ఎంపీడీవో ఎదుట కాలనీ వాసులు ఆవేదన

GNTR: తెనాలి మండలం కొలకలూరులోని బీసీ కాలనీలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఎంపీడీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామానికి వెళ్లిన ఎంపీడీవో అత్తోట దీప్తి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. గ్రామంలోని మురుగు మొత్తం పల్లపు ప్రాంతమైన బీసీ కాలనీ వైపు వస్తుందని, జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు.