VIDEO: గుంతలమయంగా రోడ్డు.. ప్రజల ఇబ్బందులు
KMR: జుక్కల్ SBI బ్యాంకు నుంచి వీక్లీ మార్కెట్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికే రోడ్డు బురదమయమై దర్శనమిస్తోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నడవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.