కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి భగీరథ జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి భగీరథ జయంతి వేడుకలు

విశాఖపట్నం కలెక్టరేట్‌లో మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ డీఆర్వో టి. గోవిందు, బీసీ వెల్ఫేర్ అధికారిణి రాజేశ్వరి తదితరులు భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, సమాజాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందులో బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.