ఆదర్శ పాఠశాలకు మాజీ సైనికుడు టేబుల్ వితరణ

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వవిద్యార్థి మాజీ సైనికుడు కొండూరు గజేంద్రవర్మ సోమవారం ఆఫీస్ టేబుల్ వితరగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజుకు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు మాట్లాడుతూ.. సైనికునిగా దేశానికీ సేవలు అందించి, చదువుకున్న పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యలు అయిన గజేంద్ర వర్మ విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు.