VIDEO: రెండో రోజు మోకాళ్లపై కూర్చుని నిరసన

అల్లూరి: గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్-3ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కొయ్యూరు మండలంలోని మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద మన్యం బంద్ నిర్వహిస్తున్నారు. బంద్‌లో పాల్గొన్న వివిధ ఆదివాసీ, ప్రజా సంఘాల నేతలు జీవో నెంబర్-3ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. పలువురు గిరిజనులు, నిరుద్యోగ అభ్యర్థులు మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.