పాలమూరులో తీన్మార్ మల్లన్న పర్యటన
MBNR: పాలమూరులో సోమవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో TRP వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో అభిమాని రామానంద్ ఆటోలో ప్రయాణించిన మల్లన్న, ఆటో డ్రైవర్లకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.