'వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పిస్తాం'
SKLM: బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆధునీకరించి అన్ని మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తామని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం కొత్తూరు, నరసన్నపేట బాలికల వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.వసతి గృహ విద్యార్థుల్లో మానసిక మనోధైర్యం పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.