హైదరాబాద్ చేరుకున్న భారత మహిళల హాకీ జట్టు
TG: ఈ నెల 8 నుంచి 14 వరకు HYDలో జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ కోసం భారత జట్టు నగరానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సలీమా నేతృత్వంలోని టీమ్ ఇండియాకు రాష్ట్ర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఈనెల 8న ఉరుగ్వేతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.