నాగర్ కర్నూల్‌లో ఉపాధ్యాయుల నిరసన

నాగర్ కర్నూల్‌లో ఉపాధ్యాయుల నిరసన

NGKL: నాగర్ కర్నూల్ పదవ తరగతి పేపర్ల వాల్యుయేషన్ కేంద్రం వద్ద గురువారం ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. గత ఏడాది పెండింగ్‌లో ఉన్న రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న వాల్యుయేషన్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని కనీసం 50 శాతం పెంచాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.